For Money

Business News

ఐటీ ముంచేసింది

ఇవాళ మార్కెట్‌ బ్రెడ్త్‌ పాజిటివ్‌గా ఉంది. 3,396 షేర్లు ట్రేడవవుతే 1,923 షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. 1357 షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. కాని నిఫ్టి ఏకంగా 198 పాయింట్ల నష్టంతో ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా ఐటీ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి. మార్కెట్‌ డార్లింగ్‌గా పేరున్న హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్‌ ఇవాళ షాక్‌ ఇచ్చింది. తనతో పాటు ఇతర ఐటీ షేర్లను ముంచేసింది. ఇవాళ ఐటీ షేర్ల సూచీ ఏకంగా నాలుగు శాతం క్షీణించింది. మిడ్‌ సెషన్‌ తరవాత కాస్త కోలుకుంటోందని అనుకున్న సమయంలో ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముంచేశాయి. దీంతో నిఫ్టి 198 పాయింట్ల నష్టంతో ముగిసింది. 24,378 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ 0.75 శాతం లాభంతో ముగిసింది. స్మాల్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒక శాతంపైగా లాభపడింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు పరవాలేదనుకున్నా ఆటో షేర్లు దెబ్బతీశాయి. వెరశి సూచీలన్నా షేర్లు నయం అన్న రీతిలో మార్కెట్‌ ముగిసింది.

Leave a Reply