For Money

Business News

దిగువన మద్దతు

ఇవాళ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కానున్నాయి. ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్‌. దీనితో ఆరంభంలో మార్కెట్‌లో కాస్త ఒత్తిడి కన్పించినా… 10.30 తరవాత రికవరీ కన్పించవచ్చు. ఆకర్షణీయ లాభాలతో ఆసియా మార్కెట్లు ట్రేడవడం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్లో ఉండటం మార్కెట్‌కు పాజిటివ్‌ సంకేతాలు. అయితే ప్రధాన ట్రెండ్‌ మాత్రం శాంతి చర్చల ఆధారంగానే ముందుకు సాగనుంది. ఫార్వర్డ్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో బ్యాంకులకు జారీ చేసిన నోటీసును ఆర్బీఐ రద్దు చేయడంతో… ఇవాళ బ్యాంకు షేర్లకు మద్దతు లభింవచ్చు. మార్కెట్‌కు ఇవాళ బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఆదిత్య బిర్లా వంటి కౌంటర్లు గ్రీన్‌లో కొనసాగే అవకాశముంది. అలాగే గ్రాసిం, కుమిన్స్‌, అరబిందో షేర్లపై కూడా దృష్టి పెట్టవచ్చు. ఒబెరాయ్‌ రియాల్టి ఆధ్వర్యంలో ఇవాళ రియాల్టి షేర్లపై ఆసక్తి కన్పించవచ్చు. అలాగే ఫలితాలు అద్భుతంగా ఉన్నందున పీఎన్‌బీ హౌసింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలలో ర్యాలీ ఉండే ఛాన్స్‌ ఉంది. ఎన్‌ఎండీసీ, హిందుస్థాన్‌ జింక్‌తో పాటు డీమర్జర్‌ ప్లాన్‌ ఖరారు కావడంతో వేదాంత షేర్లలో యాక్టివిటీ అధికంగా ఉండే అవకాశముంది.

Leave a Reply