80 శాతం షేర్లు నష్టాల్లో
ఇవాళ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఒకదశలో 23555ని తాకింది. ఇపుడు 23679 పాయింట్ల వద్ద 374 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇవాళ 3000 షేర్లు ట్రేడవగా, ఏకంగా 2264 షేర్లు అంటే 80 శాతం షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో కూడా కేవలం మూడు షేర్లు మాత్రం లాభాల్లో ఉండగా, మిగిలిన 47 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్లలో టాప్ గెయినర్స్‌గా హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఎన్టీపీసీ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో టాప్ లూజర్స్‌గా మారుతీ, ఐషర్ మోటార్స్, ఇండిగో, శ్రీరామ్ ఫైనాన్స్‌తో పాటు ఎస్బీఐ కూడా ఉన్నాయి. ఇరాన్, అమెరికా చర్చలు విఫలం కావడంతో పాటు రేపటి నుంచి హర్ముజ్ జలసంధిపై తన పెత్తనం ఉంటుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. పైగా ఇవాళ మార్కెట్లో నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. దీంతో ఇవాళ మార్కెట్లో డబుల్ ప్రెజర్ కన్పిస్తోంది.
