17300 పైన ముగిసిన నిఫ్టి
ప్రపంచ మార్కెట్లు డల్‌గా ఉన్నా నిఫ్టి మాత్రం ఇవాళ కూడా పరుగులు తీసింది. కాకపోతే ఇవాళ కాస్త ఆటోపోట్లకు లోనైంది. దీంతో డే ట్రేడర్స్ బాగా లాభపడ్డారు. మిడ్‌సెషన్‌కు ముందు నష్టాల్లో జారిన నఫ్టి 130 పాయింట్లు దాకా కోలుకుంది. రెండు గంటల ప్రాంతంలో నిన్నటి స్థాయికి చేరినా… క్లోజింగ్ రికవరీ జోరుగా సాగింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 89 పాయింట్లు లాభపడి రూ. 17,323 పాయింట్లకు చేరింది. రిలయన్స్ జియో కొత్త తేనున్న ఫోన్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ షేర్ ఇవాళ గెయినర్స్‌లో టాప్‌గా నిలిచింది. రూ.2389 వద్ద ఆల్ టైమ్ హైలో ముగిసింది. బ్యాంక్ నిఫ్టి మాత్రం రెడ్‌లో ముగియడం విశేషం. మిడ్ క్యాప్ సూచీ మాత్రం అర శాతం లాభంతో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
రిలయన్స్ 2,389.65 4.15
ఓఎన్జీసీ 123.40 4.00
కోల్ ఇండియా 146.60 3.53
టైటాన్ 2,021.00 2.74
ఐఓసీ 112.95 2.54
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్డీఎఫ్సీ లైఫ్ 734.00 -3.29
సిప్లా 941.00 -1.49
భారతీ ఎయిర్టెల్ 657.70 -1.32
హిందుస్థాన్ లీవర్ 2,772.00 -1.04 హెచ్డీఎఫ్సీ 2,755.50 -0.80