4 శాతం పెరిగిన నాస్డాక్
ఇరాన్ నుంచి తమ సైన్యం వైదొలగేందుకు సిద్ధమని, రెండు లేదా మూడు వారాల్లో యుద్ధం ముగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో వాల్‌స్ట్రీట్ భారీ లాభాలతో ముగిసింది. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లు పరుగులు పెట్టాయి. నాస్డాక్ ఏకంగా 3.83 శాతం లాభంతో ముగిసింది. అలాగే S&P 2.91 %, డౌజోన్స్ 2.49 % లాభాలతో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లో ట్రేవుతున్నాయి. రాత్రి యూరప్ మార్కెట్లలో అనూహ్య రికవరీ కన్పించింది. ఆసియా ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇదే జోష్ కన్పిస్తోంది. 4 % దాకా జపాన్ నిక్కీ, 2% లాభంతో హాంగ్‌సెంగ్ సూచీ ట్రేడవుతోంది. ఒకవైపు డాలర్ స్థిరంగా ఉండగా, రాత్రి బులియన్ భారీ లాభాల్లో ముగిసింది. మరోవైపు బ్రెంట్ ఇంకా 105 డాలర్లపైనే ట్రేడవుతోంది. యుద్ధం ముగిసినా త్వరంగా క్రూడ్ ధరలు తగ్గే అవకాశం లేదని అనిలిస్టులు అంటున్నారు.
