దుమ్మురేపుతున్న వాల్‌స్ట్రీట్
ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా స్వస్తి పలికే అవకాశాలున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలకు వాల్‌స్ట్రీట్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపే అంశాన్ని తన అనుచరులతో ట్రంప్ చర్చించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇవాళ ఓ వార్త రాసింది. హర్ముజ్ జలసంధి విషయాన్ని పట్టించుకోరాదని ట్రంప్ భావిస్తున్నట్లు ఈ పత్రిక పేర్కొంది. హర్ముజ్ జలసంధిపై పట్టుబడితో యుద్ధ విరమణ ప్రయత్నాలు మరో నాలుగు లేదా ఆరువారాలు పట్టొచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ నేవీ, మిస్సైల్ సామర్థ్యాన్ని బాగా దెబ్బ తీసినందున యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్ భావిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసింది. దీంతో నాస్డాక్ రెండు శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా ఒకటిన్నర శాతం లాభంతో, డౌజోన్స్ 1.26 శాతం లాభంతో ఉంది. డాలర్ ఇండెక్స్ కూడా ఒక్కసారిగా క్షీణించింది. ఇపుడు 99.88 వద్ద ట్రేడవుతోంది.
