For Money

Business News

లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లోముగిస్తే… యూరప్‌ మార్కెట్లు ఎటు పోవాలో తెలియక తికమక పడుతున్నాయి. ఈనేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ప్రారంభమైంది. టెక్‌ షేర్ల కంటే ఎకానమీ షేర్లకు మద్దతు అధికంగా ఉంది. డౌజోన్స్‌ ఒక శాతం దాకా లాభంతో ఉండగా, నాస్‌డాక్‌ లాభాలు 0.36 శాతానికి పరిమితం అయ్యాయి. డాలర్‌ ఇండెక్స్‌ 100.35కు చేరడం విశేషం. ఇరాన్‌తో ‘సీరియస్‌’ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ అనడంతో మార్కెట్లలో కాస్త జీవం వచ్చింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ కూడా 116 డాలర్ల నుంచి 113 డాలర్లకు పడింది. WTI క్రూడ్‌ మాత్రం రెండు శాతం పెరిగి 102 డాలర్ల వద్ద ఉంటోంది. బులియన్‌ కూడా కాస్త లాభంతో ఉంది. ఔన్స్‌ బంగారం ధర మళ్ళీ 4500 డాలర్లకు దాటింది.