For Money

Business News

22,500 దిగువకు నిఫ్టి

ఊహించినట్లుగానే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22500 పాయింట్ల దిగువకు వచ్చేసింది. 22,470ని తాకిన తరవాత ఇపుడు 22507 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో నిఫ్టి 50లో కేవలం రెండు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. 48 షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. తరవాత కోలుకుని ఇపుడు కొన్ని నిఫ్టి షేర్లు లాభాల్లోకి వచ్చాయి. హిందాల్కో, కోల్‌ ఇండియా, బీఈఎల్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ట్రెంట్‌ ఉన్నాయి. అనేక షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. డిఫెన్స్‌ షేర్లను అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. డేటా ప్యాటర్స్‌, బీఈఎల్‌ వంటి షేర్లకు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు INDIA VIX నాలుగేళ్ళ గరిష్ఠానికి చేరింది. అంటే నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంత భయం మార్కెట్‌లో నెలకొందన్నమాట. కొన్ని మెటల్‌ షేర్లను కూడా అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ డే ట్రేడింగ్‌ కోసమే. దీర్ఘ కాలిక ఇన్వెస్టర్లు ఇప్పటికీ మార్కెట్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వీరు.