For Money

Business News

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

ఇరాన్‌ గ్యాస్‌ క్షేత్రాలపై ఇజ్రాయిల్‌ దాడి చేయడంతో ఒక్కసారి గల్ఫ్‌ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలకే పరిమితమైన ఈ యుద్ధం ఇపుడు ఆర్థిక ఆస్తుల ధ్వంసం వైపు మళ్ళింది. ఇజ్రాయిల్‌ దాడి జరిగిన వెంటనే కతర్‌లోని భారీ గ్యాస్‌క్షేత్రాలను టార్గెట్‌ చేస్తూ ఇరాన్‌ దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయిల్‌లను టార్గెట్‌ చేయాలని అనుకున్న ప్రతిసారీ వాటి మిత్రదేశాలపై ఇరాన్‌ దాడి చేస్తోంది. కతర్‌పై జరిగిన భీకర దాడితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రంగంలోకి దిగారు. ఇరాన్‌ గ్యాస్‌ క్షేత్రాలపై ఇకపై ఇరాన్‌ దాడి చేయదని ఆయన హామి ఇచ్చారు. అసలు ఇరాన్‌ గ్యాస్‌ క్షేత్రాల దాడి గురించి తనకు తెలియదని ట్వీట్‌ చేశారు. ఈ స్థాయి దాడులకు, హింసకు తాను ఆమోదం తెలపలేదని ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. మరోసారి కతర్‌పై దాడి చేయొద్దని ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. దాడి చేస్తే మాత్రం పరిస్థితి చేయి దాటిపోవడం ఖాయమని ట్రంప్‌ అన్నారు.