For Money

Business News

నష్టాల నుంచి తేరుకునేనా?

హర్ముజ్‌ విషయంలో ఇరాన్‌ కొత్త మెలిక పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర మళ్ళీ 83 డాలర్లను దాటింది. హర్ముజ్‌ జలసంధిలో అమెరికా, ఇజ్రాయిల్‌ నౌకలను నిషేధిస్తూ, ఇతర నౌకలపై 20 శాతం పెనాల్టి విధేంచేందుకు ఇరాన్‌ చట్టం తెస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు రావడంతో క్రూడ్‌ 83 డాలర్లను దాటింది. దీంతో భాతర స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్‌ నిఫ్టి 92 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. నిన్నటి క్యాష్‌, ఫ్యూచర్స్ సూచీల మధ్య అంతరం బాగా తగ్గడంతో ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. నష్టాల నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందని అనలిస్టులు అంటున్నారు. మరోవైపు ఇవాళ వచ్చే ఎస్‌బీఐ ఫలితాలు నిఫ్టి ట్రెండ్‌ను నిర్ధారిస్తుందని కూడా వీరు చెబుతున్నారు. మరోవైపు నిన్న వచ్చిన ఫలితాలకు ఇవాళ మార్కెట్‌ ఇవాళ రియాక్ట్‌ కానుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ షేర్‌ రియాక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం నిర్ణయం షేర్‌ ధర అమాంతంగా పది శాతం వరకు క్షీణించిన విషయం తెలిసిందే. ఫలితాల ప్రభావంతో ఈ షేర్‌ కోలుకుంటుందా అన్న అనుమానం మార్కెట్‌లో ఉంది. ట్రెండ్‌ వీక్‌గా ఉంటే ఎల్‌ఐసీ షేర్‌కు పెద్దగా మద్దతు ఉండకపోవచ్చని అనలిస్టులు అంటున్నారు. ఇక స్థానిక షేర్లలో ఇవాళ స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ షేర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి Q1లో కంపెనీ నికర లాభం 27 శాతం పెరిగి రూ. 26.7 కోట్లకు చేరింది. అలాగే 41.5 శాతం వృద్ధితో రూ. 252 కోట్లకు ఆదాయం చేరింది. ఈ నేపథ్యంలో ఈషేర్‌కు మద్దతు లభించ వచ్చు. అలాగే న్యూల్యాండ్‌ షేర్‌లో ర్యాలీ కొనసాగే అవకాశముంది. రూ. 21,585 ధరతో 64,547 షేర్లును HDFC Mutual Fund కొంది. దీంతో ఈ షేర్‌ ధర రూ. 22వేలు దాటడం ఖాయమని అనలిస్టులు అంటున్నారు.

Leave a Reply