For Money

Business News

మా వద్ద ఆయుధాలు లేవంటారా?

ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో తాను స్వయంగా పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. హర్ముజ్‌ జలసంధిలో అమెరికా, ఇజ్రాయిల్‌ నౌకలను నిషేధించడంతో పాటు ఇతర దేశాల నౌకలపై 20 శాతం పెనాల్టి విధించే దిశగా ఇరాన్‌ అడుగులు వేస్తోంది. నౌకలోని సరుకు విలువలో 20 శాతం పెనాల్టి విధించాలని ఇరాన్‌ భావిస్తోంది. ఈ మేరకు దేశ పార్లమెంటులో బిల్లు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అన్నారు. తమ వద్ద ఆయుధాలు అయిపోతున్నాయంటూ వస్తున్న లీకులపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు ప్రచురించేవారిపై చర్యలు తీసుకుంటామని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

 

Leave a Reply