For Money

Business News

నిఫ్టి తేడా తగ్గింది

క్యాస్‌, ఫ్యూచర్స్‌ మార్కెట్‌ క్లోజింగ్‌ల మధ్య తేడా ఇవాళ గణనీయంగా తగ్గింది. అయితే కొత్త పద్ధతిలో తొలిసారి సెన్సెక్స్‌ డెరివేటివ్స్‌ ఇవాళ ముగిశాయి. అక్కడ మాత్రం తేడా కాస్త ఎక్కువగా ఉంది. నిఫ్టిలో ఇవాళ కేవలం 8 పాయింట్ల తేడాతో స్పాట్‌, ప్యూచర్స్‌ ముగిశాయి. కొత్త విధానం టెన్షన్‌ వల్లనేమో ఇవాళ నిఫ్టిలో పెద్దగా మార్పులు లేవు. గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య వ్యత్యాసం కేవలం 73 పాయింట్లు మాత్రమే. రోజంతా మార్కెట్‌ చాలా నిస్తేజంగా సాగింది. నిఫ్టి 11 పాయింట్ల లాభంతో 24636 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ డిఫెన్స్‌ షేర్లు దుమ్ముదులిపాయి. దాదాపు అన్ని డిఫెన్స్‌ షేర్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఈ రంగంలోని ప్రైవేట్‌ కంపెనీలకు కూడా మంచి మద్దతు లభించింది. బ్యాంక్‌ నిఫ్టి అరశాతం లాభపడింది. స్మాల్‌ క్యాప్‌ అర శాతం లాభపడగా, మిడ్‌ క్యాప్‌ అర శాతం క్షీణించింది. ఇటీవల భారీగా పెరిగిన ఆటో ఇండెక్స్‌ ఇవాళ ఒక శాతం క్షీణించింది. ఇక ఐటీ కూడా ఒక శాతం తగ్గింది. ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలబడటం విశేషం. తరవాతి స్థానాల్లో ఎస్‌బీఐ, బీఈఎల్‌, ఎటర్నల్‌, టైటాన్‌ షేర్లు ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో పవర్‌ గ్రిడ్‌ ఉంది. ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ షేర్‌ నాలుగు శాతం క్షీణించింది. టాటా స్టీల్‌, టీసీఎస్‌, JSW స్టీల్‌, బాజాజ్‌ ఆటో షేర్లు నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.

Leave a Reply