For Money

Business News

ఇవాళ నిఫ్టి మళ్ళీ ఢమాల్‌

ఇవాళ మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం గిఫ్ట్‌ నిఫ్టి 535 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు రాత్రి 113 డాలర్లకు చేరడంతో ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలతో ముగివాయి. పైగా చమురు ధరలకు తోడు HDFC బ్యాంక్‌ సంక్షోభం తోడు కావడంతో నిఫ్టి భారీగా నష్టపోనుంది. ఈ వారంలో ఇప్పటి వరకు వచ్చిన లాభాలన్నీ ఇవాళ తుడిచి పెట్టుకుపోతున్నాయి. నిన్ననే పుట్‌ కాల్ రేషియో 1.05కి చేరింది. ఇవాళ మార్కెట్‌లో ఒత్తిడి రానుంది. ఈవారం మార్కెట్‌లో రికవరీ వచ్చినా… సూచీల్లోగాని.. షేర్లలోగాని బలం లేదని మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల షార్టింగ్‌ డేటాను వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఫ్యూచర్స్‌ ఇండెక్స్‌లలో ఎఫ్‌ఐఐల షార్ట్‌ పొజిషన్స్‌ 86 శాతానికి చేరడమే దీనికి కారణం. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐల 58 శాతం లాంగ్‌, 42 శాతం షార్ట్‌ ఉన్నా… సూచీలలో భారీ షార్టింగ్‌ ఉంది. ఇవాళ సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉండటంతో మార్కెట్‌పై ఒత్తిడి అధికంగా ఉండే ఛాన్స్‌ ఉంది. మొత్తానికి నిఫ్టికి 23000 గండం దగ్గర్లోనే ఉందనిపిస్తోంది.