భారత్ బియ్యంపై సుంకం?
తెలుగువారిక మరో షాక్. మొన్నటి దాకా రొయ్యలపై సుంకం వేసి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇపుడు బియ్యంపై పడ్డారు. అమెరికాలో బియ్యాన్ని భారత్ డంపింగ్ చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌తోపాటు పలు దేశాలకు చాలా చౌకధరతో బియ్యాన్ని తమ దేశంలో డంప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల అమెరికా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు సమస్యలపై వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై మాట్లాడారు. బియ్యం డంపింగ్‌ను ఇక ఏమాత్రం ఉపేక్షించమని ట్రంప్ హెచ్చరించారు.
భారత్‌తో పాటు ఇతర దేశాల బియ్యంపై సుంకం వేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తాజా హెచ్చరికతో KRBLతో పాటు LT Foods షేర్లలో ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఈ రెండు కంపెనీలు గల్ఫ్‌తో పాటు అమెరికాకు భారీ ఎత్తున బియ్యం ఎగుమతి చేస్తున్నాయి.
