NSE ద్వారా అమెరికా షేర్లలో ట్రేడింగ్
ఎన్‌ఎస్‌ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అమెరికా షేర్లలో రీటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు అనుమతించనున్నారు. ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (NSE IFSC) ద్వారా దీన్ని అనుమతిస్తారు. ఇది ఎన్‌ఎస్‌ఈకి అనుబంధ సంస్థ. NSE IFSC ప్లాట్‌ఫామ్ ద్వారా అమెరికాకు చెందిన ఎంపిక చేసిన షేర్లలో ట్రేడింగ్‌కు అనుమతిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఈ ట్రేడింగ్‌ను అనుమతించనున్నారు.