For Money

Business News

46,000 దిగువకు గోల్డ్‌

డాలర్‌ ఇవాళ కూడా పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్‌ ధరలు మరింత క్షీణించాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌ బంగారం పతనం జోరుగా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2 శాతంపైగా క్షీణించి 1,727 డాలర్లకు క్షీణించింది. ఇక మనదేశంలో ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ ఇపుడు 45,868 వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్‌లో ధర రూ. 46,280 ఉంది.
వెండి మరీ ఘోరంగా…
ఒక వెండి ధరలు చాలా జోరుగా పడుతున్నాయి. అమెరికా మార్కెట్‌లో వెండి 4.35 శాతం తగ్గి 23.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 4.1 శాతం క్షీణించి రూ. 62,335 వద్ద ట్రేడవుతోంది.