For Money

Business News

కాలుష్యంలో సిమెంట్‌ కన్నా బ్యాటరీ మేలు

కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వివరణ జగన్‌ ప్రభుత్వానికి ,,చికాకు కల్గించింది. కాలుష్యం వెదజల్లుతున్నందునే అమరరాజా బ్యాటరీస్‌ తామే వెళ్ళి పొమ్మంటున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. అయితే కేంద్రం ఇవాళ ఇచ్చిన వివరణ ప్రకారం అత్యంత కాలుష్య కారక పరిశ్రమల్లో బ్యాంటరీ పరిశ్రమే లేదు. విచిత్రమేమిటంటే సీఎం కుటంబానికి ఉన్న సిమెంట్‌ పరిశ్రమ అత్యంత కాలుష్య కారక పరిశ్రమల్లో ఉండటం.
అసలేం జరిగింది?
రాజ్యసభలో బీజేపీ ఎంపీ అశోక్‌ బాజ్‌పేయి కాలుష్య కారక పరిశ్రమలు, ప్రభుత్వ విధానంపై ఓ ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో బ్యాటరీ తయారీతో సహా 81 రకాల పరిశ్రమలకు సంబంధించి పర్యావరణ నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమాధానంలో అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను 17 కేటగిరిలుగా గుర్తించినట్లు తెలిపారు. వాటి వివరాలు కూడా ఇచ్చారు. వీటిలో డిస్టలరీలు, ఎరువులు, చక్కె, పల్స్‌ అండ్‌ పేపర్‌, సిమెంట్‌, థర్మల్‌తో సహా మొత్తం 17 పరిశ్రమల పేర్లు ఇచ్చారు. ఈ జాబితాలో బ్యాటరీల పరిశ్రమ లేదు. అంటే ఈ పరిశ్రమల వల్ల అత్యంత ప్రమాదకర కాలుష్యం ఉండదు. మరి ఈ పరిశ్రమ వల్ల అత్యంత ప్రమాదకర కాలుష్యం ఉందని ఏపీ ప్రభుత్వం వాదించడం విడ్డూరంగా ఉంది.