డిస్కౌంట్‌తో ఐనాక్స్ లిస్టింగ్
ఐనాక్స్ గ్రీన్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఈ షేర్ ఇవాళ బీఎస్‌ఈలో రూ. 60.50 వద్ద లిస్టయింది. ఇష్యూ ధర రూ. 65 కావడంతో .. ఇష్యూ 7 శాతం డిస్కౌంట్‌తో లిస్టయింది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుని రూ. 62.40 వద్ద 2.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ ఇష్యూకు చాలా మంది అనలిస్టులు నో చెప్పారు. కేవలం దీర్ఘాకలిక పెట్టుబడుల కోసమే ఈ షేర్‌ను సబ్‌స్క్రయిబ్ చేయాలని అనిస్టులు సలహా ఇచ్చారు. మార్కెట్ లేదా షేర్ మరింత కరెక్షన్ వచ్చినపుడు కొనుగోలు చేయాలని వీరు అంటున్నారు.