For Money

Business News

18,300పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే తొలి ప్రధాన ప్రతిఘటన స్థాయి 18325ని తాకి ఇపుడు 18295 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 51 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 46 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే లాభాలన్నీ నామమాత్రంగా ఉన్నాయి. ఇతర సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా లాభాలు అంతంత మాత్రమే. మెటల్స్‌ ఇవాళ వెలుగులో ఉన్నాయి. అలాగే ఫార్మా షేర్‌ కూడా. లుపిన్‌ షేర్‌ను బ్రోకర్లు రెమెండ్‌ చేస్తున్నారు. లాభాలు ఆశాజనకంగా లేకపోవడంతో సీమెన్స్‌ షేర్‌ మూడు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిన్న భారీ నష్టాల తరవాత పేటీఎం ఇవాళ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే నైకా షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. షేర్‌ ఇవాళ కూడా 2.3 శాతంపైగా నష్టపోయి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిన్న రెండు శాతంపైగా లాభపడగా, ఇవాళ ఒక శాతంపైగా పెరిగింది.