రేపు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు రేపు సమ్మెకు పిలుపు ఇచ్చారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ము, భద్రతకు విఘాతం కలుగుతాయని తమ ఆందోళన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో సమ్మె చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు, ఈ సమ్మెలో ప్రైవేట్ రంగ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొనడం లేదు.
