వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్
రుణాలపై వడ్డీ రేట్లను పెంచినట్లు కెనరా బ్యాంక్ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం చొప్పున పెంచినట్లు తెలిపింది. కొత్త రేట్లు ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని రకాల రుణాలపై ఈ వడ్డీని పెంచినట్లు పేర్కొంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ తెలిపింది. ఆటో, పర్సనల్, గృహ రుణాలకు ఈ రేటును ప్రామాణికంగా తీసుకుంటారు. గత నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో తాము ఈ నెలలో పెంచినట్లు బ్యాంక్ పేర్కొంది.