బ్రైట్‌కామ్ లాభం రూ.277 కోట్లు
డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్రైట్‌కామ్ గ్రూప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.277.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.105.54 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా 166.26 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 126.38 శాతం వృద్ధితో రూ.654.05 కోట్ల నుంచి రూ.1,480.61 కోట్లకు పెరిగింది. ఇదే సమయంంలో కొత్తగా ఆరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో పాటు 14 కొత్త డైరెక్టర్ అడ్వర్టైజర్స్‌ను క్లయింట్లుగా చేర్చుకున్నట్లు పేర్కొంది.