For Money

Business News

అందరి కళ్ళూ ఎల్‌ఐసీ షేర్‌ వైపు?

చాలా రోజుల తరవాత ఎల్ఐసీ షేర్‌ కదలికలపై మార్కెట్‌ దృష్టి పెట్టనుంది. ఎందుకంటే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తరవాత కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 682.89 కోట్ల నికర లాభం ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ప్రకటించిన నికర లాభం కేవలం రూ. 2.94 కోట్లు మాత్రమే. నికర లాభం అనేక రెట్లు పెరగడంతో ఎల్‌ఐసీ షేర్‌కు మార్కెట్‌ రీరేటింగ్‌ చేస్తుందా అన్నది కూడాలి. కంపెనీ ఫలితాల తరవాత ఎల్‌ఐసీ షేర్‌ టార్గెట్‌ ధర రూ.850గా మెక్‌క్వెరి పేర్కొంది. మరోవైపు ఎల్‌ఐసీ మెడిక్లెయిమ్‌ విభాగంలో తిరిగి ప్రవేశించేందుకు ఆసక్తిని ప్రదర్శింది. బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి స్పష్టత రాగానే తాము ఆ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నామని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. తాము ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణ, గ్యారంటీడ్‌ ఆరోగ్య ఉత్పత్తుల ను నిర్వహిస్తున్నామని, వీటి విషయంలో ఐఆర్‌డీఏఐ ఇటీవల చేసిన సూచనలు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ పాలసీలకు డిమాండ్‌ అధికంగా ఉంది.