16700 దాటిన నిఫ్టి
ఆరంభంలో ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమై నిఫ్టిలో వెంటనే ఒత్తిడి వచ్చింది. మిడ్ సెషన్‌కు ముందే దిగువ స్థాయిలో మద్దతు అందడంతో కాస్సేపటి క్రితం 16707ని నిఫ్టి తాకింది. ప్రస్తుతం 16676 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 71 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా మార్కెట్‌కు బ్యాంక్స్, ఫైనాన్షియల్ గట్టి మద్దతు ఇస్తున్నాయి. ఈ సూచీలు 1.2 శాతం పైగా లాభపడటం విశేషం. మిడ్ క్యాప్ నిఫ్టి స్థిరంగా నిన్నటి స్థాయి వద్దే ఉండగా, నిఫ్టి నెక్ట్స్ నష్టాల్లో ఉంది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.అయితే లాభనష్టాల్లో పెద్దగా మార్పులేవు. మరి వారాంతాన లాభాలు స్వీకరిస్తారా లేదా ఫలితాల కారణంగా రిలయన్స్ నిఫ్టికి అండగా నిలుస్తుందా అన్నది చూడాలి. ఇవాళ మార్కెట్ ముగిసిన తరవాత సాయంత్రం రిలయన్స్ ఫలితాలు రానున్నాయి.