For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే జూన్‌లో ముగిసిన మూడు నెలల కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 17960 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 12,273 కోట్లు. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 16203 కోట్ల నిర లాభం ప్రకటించింది. దాంతో పోల్చినా నికర లాభం స్వల్పంగా పెరిగింది. అయితే టైమ్స్‌ గ్రూప్‌నకు చెందిన ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 24,311 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. కాని కంపెనీ రూ. 17955 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ. 1.4 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు చేరింది. అలాగే కంపెనీ మార్జిన్‌ కూడా 16.7 శాతం నుంచి 17.3 శాతానికి పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 15.1 శాతం మార్జిన్‌ మాత్రమే సాధించింది.