For Money

Business News

ఐటీ రిటర్న్‌లు: గడువు పెంచం

ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ల దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జులై 31తో ముగియనుంది. ఈ గడువును పొడిగించడం లేదని రెవిన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు. గడువును పెంచుతారన్న వదంతులను ఆయన ఖండించారు. అలాంటి ప్రతిపాదన తమ పరిశీలనలో లేదన్నారు. ఈ నెల 20 నాటికి 2.3 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని, ఈ నెలాఖరుకల్లా దాదాపు అన్ని రిటర్నులు ఫైలింగ్‌ అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గడువు పొడిగిస్తారని చాలా మంది ఫైలింగ్‌ వెంటనే చేయలేదు. కానీ ఇప్పుడు రోజువారీ ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందని ఆయన అన్నారు. ఇపుడు రోజుకు 15-18 లక్షల రిటర్న్‌లు దాఖలు అవుతుండగా… మున్ముందు 25-30 లక్షల వరకు దాఖలయ్య అవకాశముంది.