For Money

Business News

TECH VIEW: 16400 కీలకం

నిన్న మార్కెట్‌ 16500 స్థాయిని కాపాడుకుంది. ఒకదశలో భారీగా నష్టపోయినా..కోలుకుంది. దినసరి చార్ట్‌లను చూస్తే చిన్నపాటి బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. కాని అది ఇవాళ నిలబడుతుందా అన్నది అనుమానమే. ఇక ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో చూస్తే కాల్ రైటింగ్‌ 17200 వద్ద చాలా ఎక్కువగా ఉంది. అలాగే 17000 కాల్స్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ బాగా పెరుగుతోంది. ఇక పుట్‌ సైడ్‌ చూస్తే… అత్యధికంగా ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 16300 వద్ద ఉంది. ఆ తరవాత అధిక పుట్ రైటింగ్‌ 16500 వద్ద ఉంది. అంటే 16500 గట్టి మద్దతుగా ఉందన్నమాట. మరి ఈ స్థాయి ఇవాళ నిలబడుతుందేమో చూడాలి.

ఇక ఇవాళ్టికి లెవల్స్‌
నిఫ్టి
50 EMA 16671
100 EMA 16915
నిఫ్టి బ్యాంక్‌
50 EMA 35455
100 EMA 36012
(EMA- Exponential Moving Average)