For Money

Business News

రాణించిన యాక్సిస్‌ బ్యాంక్‌

ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank) స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.5,797 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,125 కోట్లతో పోలిస్తే నికర లాభం 40.5 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ పేర్కొంది. అలాగే నికర వడ్డీ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 11959 కోట్లకు చేరింది. అయితే నికర లాభం మాత్రం మార్కెట్‌ అంచనాలను (రూ. 6000 కోట్లు)ను దాటలేకపోయాయి. నికర వడ్డీ మార్జిన్‌ అర శాతం పెరిగి 4.10 శాతానికి చేరింది. బ్యాంక్‌ వడ్డీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 18728 కోట్ల నుంచి రూ.25,556 కోట్లకు చేరింది.ఫీజుల ద్వారా బ్యాంక్‌ వసూలు చేసిన మొత్తం 28 శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్‌ ఆపరేటింగ్‌ లాభం 50 శాతం పెరిగి రూ. 8814 కోట్లకు చేరింది.