For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ – స్విగ్గీ క్రెడిట్‌ కార్డ్‌

బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC bank), స్విగ్గీ (Swiggy) కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును మార్కెట్‌లోప్రవేశపెట్టాయి. మాస్టర్‌ కార్డ్‌ పేమెంట్‌ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేస్తుందని ఈ సంస్థలు తెలిపారు. స్విగ్గీ నుంచి ఇలాంటి క్రెడిట్‌ కార్డు రావడం ఇదే తొలిసారి. ఈ కార్డు ద్వారా చేసే కొనుగోలు చేసే ఫుడ్‌, గ్రాసరీ డెలివరీలపై స్విగ్గీ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు ఉంటాయని స్విగ్గీ పేర్కొంది. ఇలా వచ్చిన డిస్కౌంట్‌ మొత్తం స్విగ్గీ మనీలో జమ అవుతుంది. ఆ మొత్తాన్ని స్విగ్గీ ద్వారా చేసే ఇతర లావాదేవీలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

షరతులు వర్తిస్తాయి…
ఈ కార్డు పొందాలనుకునే వారు జాయినింగ్‌ ఫీజు కింద రూ.500. వార్షిక ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో గనుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే ఈ ఫీజును రద్దు చేస్తారు. రెంట్‌ పేమెంట్‌, యుటిలిటీ బిల్స్‌, ఫ్యూయల్‌, ఇన్సురెన్స్‌, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్‌ బ్యాక్‌ వర్తించదు. పైగా ఒక నెలలో 10 శాతం, 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కింద రూ.1,500 మాత్రమే లభిస్తుంది.