For Money

Business News

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో మహీంద్రాల వాటా

రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (RBL Bank)లో మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) 3.53 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీని కోసం రూ. 417 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. అయితే కేవలం పెట్టుబడిగా ఈ బ్యాంక్‌లో వాటా తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మహీంద్రాలు వాటా కొన్నట్లు ఇవాళ సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి స్పందిస్తూ… తాము వాటా కొనుగోలు చేసిన మాట నిజమేనని మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. షేర్‌ ధర, నియంత్రణా సంస్థల ఆమోదం వంటి అంశాలను బట్టి ఈ బ్యాంక్‌లో మరింత వాటా కొనే అంశాన్ని పరిశీలిస్తామని ఎం అండ్ ఎం పేర్కొంది. ఈ బ్యాంక్‌లో ఇప్పటికే బేరింగ్స్ ఏషియాకు 10శాతం వాటా, గజా క్యాపిటల్‌, సీడీసీలకు వాటా ఉంది. ఎం అండ్‌ ఎం వాటా కొనుగోలుకు సంబంధించి మార్కెట్‌లో వదంతులు ఉన్నాయి. దీంతో ఇవాళ ఈ షేర్‌ ఏడు శాతం లాభంతో రూ. 239 వద్ద ముగిసింది. అంతకుముందు రూ. 242ను కూడా తాకింది. ఇదే 52 వారాల గరిష్ఠ ధర. సరిగ్గా ఏడాది క్రితం అంటే జూలై 25వ తేదీన ఈ బ్యాంక్‌ షేర్‌ రూ.90.20ల కనిష్ఠ స్థాయిని తాకింది.