For Money

Business News

నికర లాభంలో 307 శాతం వృద్ధి

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జూన్‌తో ముగిసిన) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.1,255.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.308.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటింది. అంటే 307 శాతం వృద్ధితో నమోదు చేసిందన్నమాట. ఇక నికర వడ్డీ ఆదాయం కూడా 26 శాతం పెరిగి రూ.7,542.80 కోట్ల నుంచి రూ.9,504.30 కోట్లకు చేరింది. ప్రస్తుత త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు కూడా 2.72% నుంచి 1.98 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. డిపాజిట్లు 14.17 శాతం పెరిగి రూ.12.98 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవాళ బ్యాంక్‌ షేర్‌ 4.12% పెరిగి 63.20 వద్ద ముగిసింది.