For Money

Business News

14,950 SLతో కొనండి

మార్కెట్‌లో చాలా మంది బ్రోకర్లు సూచీలను ముఖ్యంగా నిఫ్టిని కొనుగోలు చేసేందుకు సిఫారసు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందు… మున్ముందు అన్ని పరిశ్రమలు ఊపందుకుంటాయని… అంతార్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వీరు అంచనా వేస్తున్నారు. పొజిషినల్‌ ట్రేడర్స్‌ 14700 లేదా 14750 స్టాప్‌లాస్‌తో తమ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చని… షార్ట్‌ టర్మ్‌ కోసం ట్రేడ్‌ చేసేవారు 14,950 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చని సలహా ఇస్తున్నారు. నిఫ్టి పడేంత వరకు ఓపికతో వెయిట్‌ చేసి… దిగువ స్థాయిలో కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇవాళ పదింటిలోపు ఈ అవకాశం వస్తుందేమో చూడండి. టార్గెట్‌ 15,400 లేదా 15,500. డే ట్రేడర్స్‌తో పాటు షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్స్‌ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధాన అంశం… ఈవారం మే నెల డెరివేటివ్స్‌తో పాటు వారంతపు కాంట్రాక్ట్‌ల క్లోజింగ్స్‌ ఉన్నాయి. రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేనివారు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.