For Money

Business News

బ్యాంకుల అండతో నిఫ్టి అప్‌

ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం లాభంతో మార్కెట్‌ ప్రారంభమైంది. బ్యాంకులతో పాటు ఫైనాన్స్‌ కంపెనీల మద్దతుతో నిఫ్టి 68 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 15,193కి క్షీణించిన తరవాత నిఫ్టి మళ్ళీ 68 పాయింట్ల లాభంతో 15,243 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 31 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. పదింటిలోపల నిఫ్టిలో లాభాల స్వీకరణ వస్తుందేమో చూడాలి. 15,175 -15,150 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుత స్థాయిలో కొనడంకన్నా… దిగువ స్థాయిలో కొనుగోలు చేయాలని చెబుతున్నారు. గురువారం వరకు అంటే డెరివేటివ్‌ క్లోజింగ్‌ కోసం ట్రేడ్‌ చేసేవారు 15120 స్టాప్‌లాస్ పెట్టుకోవడం శ్రేయస్కరం. నిఫ్టికి 15,250 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 15400వైపు పయనం ప్రారంభమైనేట్లే. బ్యాంక్‌ నిఫ్టికి కూడా 34800 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురు కావొచ్చు. 34,000 వద్ద నిఫ్టికి మద్దతు అందకపోతే మరిన్ని నష్టాలు తప్పవు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎస్‌బీఐ 412.70 2.87
ఐఓసీ 106.10 1.73
పవర్‌గ్రిడ్‌ 231.80 1.69
హీరోమోటో 2,932.45 1.67
సిప్లా 940.95 1.52

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
JSW స్టీల్‌ 677.00 -3.04
హిందాల్కో 381.50 -2.13
శ్రీసిమెంట్‌ 27,074.95 -1.98
టాటా స్టీల్‌ 1,091.10 -1.98
టైటాన్‌ 1,524.00 -0.93