ఆరంభమైన చోటే ముగిసిన నిఫ్టి
మార్కెట్ ఇవాళ హెచ్చతగ్గుల కులోనైంది. అధిక స్థాయిల వద్ద నిఫ్టి గట్టి ప్రతిఘటన ఎదురైంది. రెండు సార్లు రెడ్‌లోకి వెళ్ళిన నిఫ్టి క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 15,197 వద్ద 22 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం 15,211 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ ఆరంభంలోనే 15,244 పాయింట్లను తాకింది. సరిగ్గా పది గంటలకు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి15,145 పాయింట్లను తాకింది. అంటేదాదాపు వంద పాయింట్లకు పైగా క్షీణించింది. వెంటనే కోలుకున్న మార్కెట్ హెచ్చుతగ్గులతో ట్రేడవుతూ.. మూడు గంటల ప్రాంతలో ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 15,256ని తాకింది. అంటే వంద పాయింట్లకు పైగా లాభపడిందన్నమాట. స్క్వేర్ ఆఫ్ సమయంలో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి క్లోజింగ్ కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. ఉదయం భారీ లాభాలతో ట్రేడైన పలు బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు.మెటల్స్‌లో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగింది. నిఫ్టికన్నా మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఒక మోస్తరు లాభాలతో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఐఓసీ 109.40 4.89
బీపీసీఎల్ 473.80 2.77
ఎస్బీఐ 411.00 2.44
ఎల్ అండ్ టీ 1,443.00 1.76
ఐషర్ మోటార్స్ 2,559.35 1.47
నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీసిమెంట్ 26,930.00 -2.51
JSW స్టీల్ 682.50 -2.25
టాటా స్టీల్ 1,091.50 -1.94
బ్రిటానియా 3,384.55 -1.49 ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,002.00 -1.38
