For Money

Business News

స్ట్రీట్‌ ఫేవరేట్‌ : ఎస్‌బీఐ

నిజం చెప్పాంటే ఎస్‌బీఐ పనితీరు పరవాలేదు. బ్యాంకు పాత అప్పులు వసూలు కావడంతో భారీగా లాభాలు ప్రకటిస్తోంది. కాని మార్కెట్‌లో దాదాపు అన్ని బ్రోకింగ్‌ సంస్థలు ఎస్‌బీఐని రెకమెండ్‌ చేస్తున్నాయి. గత శుక్రవారం ఈ షేర్‌ రూ.401 వద్ద ముగిసింది. జనవరి 28న రూ. 267 ప్రాంతంలో ఉన్న షేర్‌ పిబ్రవరి 18న రూ. 425 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి పడుతూ వచ్చిన షేర్‌ ఏప్రిల్ 19న రూ. 318కి చేరింది. ఫలితాల నేపథ్యంలో అక్కడి నుంచి కోలుకుంటూ వచ్చిన ఈ షేర్‌ గత శుక్రవారం రూ. 401కి చేరింది. తీవ్ర హెచ్చతుగ్గులకు లోనవుతున్న ఈ షేర్‌ను ఇపుడు చాలా బ్రోకింగ్‌ సంస్థలు రెకమండ్‌ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఇక బ్యాంకులకు నిరర్థక ఆస్తుల బెడత చాలా వరకు తగ్గడం. రెండోది భారీ కార్పొరేట్‌ రుణాలకన్నా హౌసింగ్‌ రుణాలు, రీటైల్‌ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మున్ముందు బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక ఆస్తుల బెడద ఎక్కువయ్యే అవకాశముంది. అలాగే టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. వీటికి భారీ పెట్టుబడులు అవసరం. ఈ రెండు అంశాలు ఎస్‌బీఐకి ప్లస్‌. మున్ముందు చిన్న బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బలహీనపడతే ఆ వ్యాపారం ఎస్‌బీఐకి చేరుతుందని అనలిస్టుల అంచనా. అందుకే చాలా వరకు అనలిస్టులు ఎస్‌బీఐ కనీసం రూ. 480 టార్గెట్‌కు చేరుతుందని అంచనా వస్తున్నారు. ఎస్‌ఎల్‌ఎఎస్‌ రీసెర్చి సంస్థ మాత్రం ఎస్‌బీఐ టార్గెట్‌ రూ.650గా పేర్కొంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కూడా ఎస్‌బీఐకి బై రేటింగ్‌ ఇస్తోంది. ఈ సంస్థ ఇస్తున్న టార్గెట్ రూ. 544. మోతీలాల్‌ కూడా ఇదే స్థాయి టార్గెట్‌ను సూచిస్తోంది. పొజిషనల్ ట్రేడర్స్‌ వెంటనే, ప్రస్తుత స్థాయిలో కాకుండా… తగ్గినపుడల్లా కొద్ది కొద్దిగా తమ పోర్టుఫోలియోలో చేర్చుకోవడం మంచిది.