For Money

Business News

స్థిరంగా వాల్‌స్ట్రీట్‌

నష్టాలతో ఆరంభమైన వాల్‌స్ట్రీట్‌.. తరవాత లాభాల్లోకి వచ్చింది. ఇపుడు మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది. అయితే లాభనష్టాలన్నీ పరిమితంగానే ఉన్నాయి. డౌజోన్స్‌ మాత్రం ఓపెనింగ్‌ నుంచి లాభాల్లో ఉంది. అమెరికాలో మాంద్యం తథ్యమని ఒకవైపు వార్తలు వస్తుండగా, చైనాలో పెరుగుతున్న కోవిడ్ కారణంగా అక్కడ డిమాండ్‌ తగ్గే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. దీంతో క్రూడ్‌ ఇవాళ ఏడు శాతం క్షీణించింది.బ్రెంట్ క్రూడ్‌ మళ్ళీ 1000 డాలర్ల లోపు వచ్చింది. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో చాలా రోజుల తరవాత ఒత్తిడి కనిపిస్తోంది. ఆయిల్‌తోపాటు మెటల్స్‌ కూడా భారీగా క్షీణిస్తున్నాయి. బులియన్ ఒక మోస్తరు నష్టాలకు పరిమితం కాగా, కాపర్‌ వంటి లోహాలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.