For Money

Business News

హచ్‌సీఎల్‌ టెక్‌: ఆదాయం పెరిగినా…

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా.. నికర లాభం విషయం కంపెనీ నిరాశపర్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర ఆదాయం కేవలం 2.4 శాతం పెరిగి రూ. 3205కోట్ల నుంచి రూ.3283 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 16.92 శాతం పెరిగి రూ. 20,068 కోట్ల నుంచి రూ. 23,464 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ మాత్రం 25.20 శాతం నుంచి రూ. 21.2 శాతానికి తగ్గింది. 2022-23 ఏడాదికి గైడెన్స్‌ ఇస్తూ.. టర్నోవర్‌ 12 శాతం నుంచి 14 శాతం పెరిగే అవకాశముందని, ఎబిట్‌ మార్జిన్‌ 18 నుంచి 20 శాతం మధ్య ఉండొచ్చని వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది.తాజా త్రైమాసికంలో 6023 మంది కొత్తవారిని ఉద్యోగంలోకి తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.