For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ ఒకటిన్నర శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు అర శాతం లాభాలకే పరిమితమయ్యాయి. అదే రోజు యూరో మార్కెట్లు గ్రీన్‌లో క్లోజయ్యాయి. లాభాలు నామ మాత్రమే. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. లాభాల్లో ఉన్న మార్కెట్లు నామ మాత్రపు లాభాలకు పరిమితం కాగా, నష్టాల్లో ఉన్న మార్కెట్లు అరశాతంపైగా పడ్డాయి. ముఖ్యంగా చైనా అర శాతం రెడ్‌లో ఉంది.మరోవైపు డాలర్‌ ఇపుడు కూడా స్థిరంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 90పైన గ్రీన్‌లో ఉంది. క్రూడా ఆయిల్‌ ధరల్లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 72 డాలర్లకు దగ్గర అవుతోంది. బులియన్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం స్వల్ప లాభాతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా నామ మాత్రపు లాభాలతో లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.