For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. నిన్న యూరో, అమెరికా దాదాపు స్థిరంగా ముగిశాయి. నష్టాల్లో ఉన్నా నామ మాత్రమే. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. చైనా మినహా మిగిలిన మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ అరశాతంపైగా లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. లేదా స్వల్ప నష్టాలతో మొదలు కావొచ్చు. నిఫ్టి 15300 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. 15,100 వద్ద మద్దతు లభించే అవకాశముంది.