For Money

Business News

మద్దతు స్థాయి పైన క్లోజింగ్‌

తొలి ప్రతిఘటన స్థాయి 15,300ని నిఫ్టి దాటలేకపోయింది. ఉదయం ఓపెనింగ్‌లో 15,293ని తాకింది నిఫ్టి. అదే గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి మిడ్‌ సెషన్‌ వరకు అక్కడక్కడా తగ్గుతూ వస్తున్నా… మిడ్‌ సెషన్‌ తరవాత స్పీడుగా నష్టాల్లోకి వెళ్ళింది. 15,163ని తాకిన నిప్టికి స్వల్ప మద్దతు రావడంతో కోలుకుంది. స్వేర్‌ ఆఫ్‌ సమయంలో తీవ్ర ఒడుదుడుకులతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 11 పాయింట్ల లాభంతో 15,208 వద్ద ముగిసింది. 15,300 ప్రాంతంలో అమ్మినవారికి 100 నుంచి 150 పాయింట్లు లాభం వచ్చినట్లే. నిఫ్టి మళ్ళీ ప్రధాన మద్దతు స్థాయి పైన క్లోజ్‌ కావడంతో రేపటి ట్రేడింగ్‌ కీలకంగా మారింది. ఇవాళ బ్యాంకుల్లో ఒక మోస్తరుగా ఒత్తిడి వచ్చింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా స్వల్ప నష్టంతో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్
ఏషియన్‌ పెయింట్స్‌ 2,918.05 3.51
టైటాన్‌ 1,571.15 3.31
JSW స్టీల్‌ 702.00 3.02
ఐషర్‌ మోటార్స్‌ 2,626.05 2.93
బ్రిటానియా 3,441.00 2.21

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,481.00 -1.92
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 661.05 -1.37
యాక్సిస్‌ బ్యాంక్‌ 732.40 -1.18
రిలయన్స్‌ 1,964.00 -1.09
కోల్‌ ఇండియా 147.50 -0.94