For Money

Business News

స్థిరంగా ట్రేడువుతున్న నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి రేంజ్‌లోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 19 పాయింట్ల లాభంతో 15,226 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నాయి. ఎంపిక చేసిన షేర్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్నా వెంటనే కోలుకుంది. బులియన్‌ మార్కెట్‌ బాగుండటంతో ఈ రంగంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధమున్న షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి 0.3 శాతం నష్టంతో ట్రేడవుతోంది. పెద్దగా మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇవాళ లేవు. దీంతో నిఫ్టిలో పెద్ద హెచ్చుతగ్గులు ఉండకపోవచ్చు. నిఫ్టి 15100-15300 రేంజ్‌లో కొనసాగే అవకాశముంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టైటాన్‌ 1,599.00 1.90
గ్రాసిం 1,401.00 1.90
సిప్లా 949.35 1.47
యూపీఎల్‌ 808.35 1.47
టాటా మోటార్స్‌ 319.70 1.41

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
JSW స్టీల్‌ 685.00 -2.25
పవర్‌గ్రిడ్‌ 229.40 -1.50
టాటా స్టీల్‌ 1,089.00 -1.47
హిందాల్కో 388.00 -0.82
ఐసీఐసీఐ బ్యాంక్‌ 645.15 -0.79