For Money

Business News

ప్రతిఘటన స్థాయి వద్దే ముగింపు

ఉదయం నిఫ్టి రెండు సార్లు కొనుగోలు ఛాన్స్‌ ఇచ్చింది. ఆరంభమైన కొద్దిసేపటికే 15,194కి తాకిన నిఫ్టి వెంటనే గ్రీన్‌లోకి వచ్చింది. ఆ వెంటనే నష్టాల్లోకి వెళ్ళినా… అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ వచ్చింది.యూరో మార్కెట్లు కూడా దాదాపు అరశాతం లాభంతో ట్రేడ్‌ కావడం, రేపు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టి తన తొలి ప్రతిఘటన స్థాయి 15300 ప్రాంతంలోనే కాస్త అటూఇటూ కదలింది. ఎట్టకేలకు 93 పాయింట్ల లాభంతో 15,301 పాయింట్ల వద్ద ముగిసింది. మొన్నటి దాకానిఫ్టికి టానిక్‌లా పనిచేసిన మెటల్స్‌ ఇపుడు వెనక్కి లాగుతున్నాయి. ఫైనాన్షియల్స్‌ లో కాస్త కన్పించడంతో నిఫ్టి తట్టుకోగలిగింది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఒత్తిడి కన్పించడంతో ఆ సూచీ రెడ్‌లో ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 11,900.00 4.61
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,768.55 2.67
ఇన్ఫోసిస్‌ 1,395.00 2.45
గ్రాసిం 1,408.00 2.41
విప్రో 527.25 1.87

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
పవర్‌గ్రిడ్‌ 225.90 -3.01
హిందాల్కో 381.40 -2.51
JSW స్టీల్‌ 683.85 -2.42
టాటా స్టీల్‌ 1,080.05 -2.28
ఎన్‌టీపీసీ 111.15 -1.90