For Money

Business News

బంగారం రూ. 50,000 దాటేనా?

స్పాట్‌ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ భారీగానే పెరిగింది.పది గ్రామలు స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 527 పెరిగి రూ. 48,589కి చేరింది. అలాగే వెండి ధర కూడా రరూ. 1,043 పెరిగి రూ. 71,775 చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడమే దీనికి కారణం. డాలర్‌ బలహీనంగా ఉంది కాబట్టి… బంగారం ధర మన మార్కెట్‌లో స్వల్పంగానే పెరిగింది.

ఫ్యూచర్స్‌ మార్కెట్‌
బంగారం స్పాట్‌లో కంటే ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఎక్కవ ట్రేడింగ్‌ జరుగుతుంది. మల్టి కమాడిటీ మార్కెట్‌ (MCX)లో జూన్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ ఇపుడు రూ. 48,939 వద్ద ట్రేడవుతోంది. బులియన్‌ ధరలు ఇపుడు నాలుగున్నర వారాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. డాలర్‌ కూడా నాలుగున్నర వారాల కనిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు దెబ్బ తినకూడదని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డాలర్‌ విలువ పెరగకుండా చూస్తోంది. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ కూడా. దీంతో బులియన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇతర మెటల్స్‌ ధరలు తగ్గుతున్నా ఇన్వెస్టర్లు బులియన్‌పై ఆసక్తి చూపుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో భారీ మార్పులు లేవకపోవడంతో… బులియన్‌ బెటర్‌ అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

టెన్నికల్స్‌ పరంగా
టెక్నికల్స్‌ పరంగా చూస్తే ఔన్స్‌ బంగారం ధర 1908 డాలర్లను తాకింది ఇవాళ. అమెరికా మార్కెట్‌ ప్రారంభం తరవాత కూడా ఇదే జోరుగు కొనసాగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే 1,900 డాలర్ల వద్ద బంగారానికి గట్టి ప్రతిఘటన ఉంది. ఈ స్థాయి దాటితే 1922డాలర్లు, ఆ తరవాత 1958డాలర్లని తాకే అవకాశాలు ఉన్నాయని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. 2000 డాలర్లు ఇదే బుల్‌ ట్రెండ్‌లో తాకుందా అన్న అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బంగారం మళ్ళీ 1,850 ప్రాంతానికి వెళ్ళిన తరవాత మళ్ళీ పుంజుకున్నపుడు కచ్చితంగా 2,000 డాలర్లు దాటుతుందని మెజారిటీ అనలిస్టులు అంటున్నారు. అంటే 1,950 లోపల ఒక్కడో ఒక చోట లాభాల స్వీకరణ వస్తుందని వీరి అంచనా. డాలర్‌కు మద్దతు లభించదని అమెరికా తేల్చేసింది కాబట్టి, ఒకవేళ స్టాక్‌ మార్కెట్‌ పడితే.. బంగారం 2,000 డాలర్లను క్రాస్‌ చేయొచ్చు. ఇక వెండికి మరో ప్లస్‌ పాయింట్‌ ఉంది. పారిశ్రామిక రంగం ఊపందుకున్నట్లు వార్తలు వస్తే… బంగారంతో పనిలేకుండా వెండి ముందుకు సాగే అవకాశముంది. అయితే ఏడాదిలో వెండి ధర 100 శాతం పెరిగింది. ఆ విషయం మర్చిపోవద్దు.గత ఏడాది మార్చి 1వ తేదీన 14.33 డాలర్లు ఉన్న వెండి ధర ఇపుడు 28.33 డాలర్ల వద్ద ఉంది? సో… కరెక్షన్‌కు అవకాశాలు ఉన్నాయి.