For Money

Business News

తొలి ప్రతిఘటన స్థాయిలో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి దారిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభంతో మొదలైంది. 15,293కి చేరగానే లాభాల స్వీకరణ మొదలైంది. నిఫ్టి ప్రస్తుతం 15,280 వద్ద 82 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి ప్రధాన తొలి అవరోధం 15,300 వద్ద ఎదురు కానుంది. పదిగంటల వరకు డే ట్రేడర్స్‌ వెయిట్‌ చేయడం మంచిది. దిగువకు వస్తే 15,200 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. కాని ఎల్లుండి డెరివేటివ్స్‌ మే కాంట్రాక్ట్స్ ముగింపు ఉన్నందున స్టాప్‌లాస్‌ గమనించండి. ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉన్నందున జూన్‌ కాంట్రాక్ట్‌లలోనే ట్రేడింగ్‌ చేయండి. మే కాంట్రాక్ట్‌ జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళ్ళొద్దు. ఇవాళ మార్కెట్‌కు మెటల్స్‌ నుంచి మద్దతు లభించింది. గత కొన్ని రోజుల నుంచి ఈ షేర్లు క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి చైనా మార్కెట్‌లో మెటల్స్‌ మద్దతు లభిస్తోంది. నిప్టిలో 48 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. కాని బ్యాంక్‌ నిఫ్టి క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. అంటే నామమాత్రపు లాభాలకే ఈ షేర్లు పరిమితమయ్యాయన్నమాట.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
JSW స్టీల్‌ 695.50 2.06
టాటా స్టీల్‌ 1,113.40 1.96
హిందాల్కో 396.70 1.90
నెస్లే ఇండియా 17,679.10 1.84
ఎం అండ్‌ ఎం 822.85 1.59

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,502.80 -0.47
కోల్‌ ఇండియా 148.80 -0.07