For Money

Business News

నిఫ్టి….పడితే కొనండి…

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. స్వల్ప నష్టంతో కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అనలిస్టులు మాత్రం నిఫ్టి ఏమాత్రం పడినా.. కొనుగోలుకు అవకాశంగా భావిస్తున్నారు. నిఫ్టిలో బుల్‌ రన్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. డే ట్రేడింగ్‌ కోసమే గాక… పొజిషనల్‌ ట్రేడింగ్‌ కోసం కూడా నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. కొటక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన శ్రీకాంత్‌ చౌహాన్‌ కూడా నిఫ్టిని కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. డే ట్రేడింగ్‌ కోసం 15100 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.