For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక ప్యాకేజీని మార్కెట్‌ పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ నష్టాల్లో క్లోజ్‌ కాగా, నాస్‌డాక్‌ లాభాల్లో ముగిసింది. అంతకుముందు నిన్న యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కొన్ని సూచీలు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ను ఇపుడు డెల్టా వైరస్‌ భయపెడుతోంది. అనేక దేశాలు కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి. హాంగ్‌సెంగ్‌తో నిక్కీ, చైనా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ఉంది. నిఫ్టి స్థిరంగా లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది.