For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

మార్కెట్లు ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.డౌజోన్స్‌ ఆకర్షణీయ లాభాలతో క్లోజ్‌ కాగా, నాస్‌డాక్‌ స్థిరంగా ముగిసింది. అంతకుముందు యూరో స్టాక్‌ కూడా స్థిరంగా ముగిసింది. కాని ఉదయం నుంచి మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. తైవాన్‌, హాంగ్‌సెంగ్‌ గ్రీన్లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. తైవాన్‌ ఒక్కటే 0.4 శాతం లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,900 స్థాయిని చేరే అవకాశముంది. మరి అక్కడ నిలబడుతుందా లేదా అనేది నిఫ్టి రివ్యూలో చదవండి.