For Money

Business News

BUY &SELL: తొలుత అమ్మండి…

మార్కెట్లు గ్రీన్‌లోఉన్నా.. భారీ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. డాలర్ తగ్గడం లేదు. అలాగే క్రూడ్‌ కూడా. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్రీన్లో ఉన్నా ఒత్తిడి ఖాయం. కాని టెన్నికల్‌గా సూచీలు ఓవర్‌ సోల్డ్‌ నుంచి బయటపడుతున్నాయి. అంటే దిగువ స్థాయిలో మద్దతు లభించనుంది. కాబట్టికి నిఫ్టి రెండు వైపులా కదలాడే అవకాశముంది. భారీ లాభాలు లేకున్నా భారీ నష్టాలు కూడా ఉండవు. కార్పొరేట్‌ ఫలితాలు వచ్చే వరకు నిఫ్టిలో పెద్ద మార్పుచేర్పులు అనుమానమే. డే ట్రేడర్స్ ఇవాళ ఓపెనింగ్‌ను చూడాలి. నిఫ్టి గనుక 15900పైన ప్రారంభమైతే 15,915 దాకా వెళుతుందేమో చూడండి. ఇదే జరిగితే 15,930 స్టాప్‌ లాస్‌తో అమ్మండి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15900 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టి 15,930 దాటితే నో సెల్లింగ్‌. నిఫటి ఇవాళ 15850. ఎగువస్థాయిలో అమ్మే వారు నిఫ్టి ఈస్థాయికి వస్తుందేమో చూండి. ఈ స్థాయి దిగువకు వెళితే నిఫ్టి 15830, 15815కు కూడా వెళ్ళే అవకాశముంది. ఈ స్థాయిలో కొనుగోలుకు ఛాన్స్‌ ఉంది. పొజిషనల్‌ ట్రేడర్స్‌ కూడా 15,790 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి ఇవాళ నిఫ్టిలో కన్నా బ్యాంక్‌ నిఫ్టి బుల్లిష్‌గా ఉంది. ఇవాల చాలా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవయ్యే అవకాశముంది.