For Money

Business News

బంగారం దిగుమతులు భారీగా పెరిగినా…

ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌-మే మధ్యకాలంలో మనదేశం 691 కోట్ల డాలర్ల అంటే రూ. 51,438 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బంగారం దిగుమతులు భారీగా పెరిగినట్లు కన్పించినా.. వాస్తవానికి గొప్ప విషయం కాదు ఎందుకంటే గత ఏడాది కరోనా విజృంభణ కారణంగా కేవలం రూ. 599 కోట్ల విలువైన బంగారం మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ఆ మొత్తంతో పోలిస్తే భారీగా పెరిగినా… అంతముందు ఏడాదితో పోలిస్తే తక్కువ. మరోవైపు వెండి దిగుమతులు ఏకంగా 93.7 శాతం క్షీణించి కేవలం 2.55 కోట్ల డాలర్లకు పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ వాణిజ్యలోటు భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్-మే మధ్యకాలంలో వాణిజ్యలోటు కేవలం 991 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 2,138 కోట్ల డాలర్లకు చేరింది.