For Money

Business News

సీఈఓగా రాజీనామా: జెఫ్ బెజోస్‌

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సీఈఓ పదవి నుంచి జూలై 5న తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్, వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ కొత్త సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇకపై బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. `సరిగ్గా 27 ఏళ్ల క్రితం అదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే ఆ తేదీ నాకు చాలా ప్రత్యేకమైనద`ని బెజోస్ అన్నారు.